ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టి సీఎం రేవంత్ గాడిద గుడ్డు పట్టుకుని తిరుగుతున్నారు : అర్వింద్ - MP Arvind on CM Revanth - MP ARVIND ON CM REVANTH
🎬 Watch Now: Feature Video
Published : May 1, 2024, 7:41 PM IST
MP Arvind Fire on CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టి గాడిద పట్టుకుని తిరుగుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఇవాళ నిజామాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి అర్వింద్ మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడిన భాషను ఎంపీ అర్వింద్ తప్పుబట్టారు. ఓ వైపు ప్రధాని మోదీ దేశం కోసం కష్టపడుతుంటే, కాంగ్రెస్ నాయకులు గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్లను తీసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని ఇప్పటికే మోదీ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే గుజరాత్ నుంచి వచ్చారని సీఎం రేవంత్ అంటున్నారని, మరి ఆయన పాలమూరు నుంచి వచ్చారా అని ప్రశ్నించారు.