కేసులు సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం: ఎన్హెచ్ఆర్సీ ఛైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా - జాతీయ మానవ హక్కుల కమిషన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 6, 2024, 7:59 PM IST
NHRC chairperson arun Mishra Meeting in Vijayawada : జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్దకు వచ్చే కేసులను సకాలంలో, సమర్థవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎన్హెచ్ఆర్సీ ఛైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా చెప్పారు. విజయవాడ పోలీస్ కమాండ్ సెంటర్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ జస్టిస్ మిశ్రా సభ్యులతో కలిసి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఏడాదిలో లక్షకు పైగా కేసులు ఎన్హెచ్ఆర్సీకి వస్తున్నాయని తెలిపారు.
NHRC Participated in meeting at Vijayawada : నిర్ణీత కాలవ్యవధిలో ఈ కేసులను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సీ వద్ద 6 వేల పెండింగ్ కేసులు మాత్రమే ఉన్నాయని జస్టిస్ మిశ్రా చెప్పారు. పెండింగ్ (Pending) కేసుల్లో సకాలంలో ఏటీఆర్ లు సమర్పించాలని వివిధ శాఖలకు కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని జస్టిస్ మిశ్రా చెప్పారు. బాధితులకు సకాలంలో న్యాయం అందించడమే మానవ హక్కుల కమిషన్ లక్ష్యమని జస్టిస్ మిశ్రా అన్నారు. పెండింగ్ కేసుల (Case) సత్వర పరిష్కారానికి ఎన్హెచ్ఆర్సీ (NHRC) ప్రణాళికాయుతంగా కృషి చేస్తుందని తెలిపారు.