LIVE జగన్ ఐదేళ్ల పాలనపై చార్జ్ షీట్ విడుదల- కూటమి నేతల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - NDA Chargesheet - NDA CHARGESHEET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 25, 2024, 4:15 PM IST
|Updated : Apr 25, 2024, 4:36 PM IST
NDA Chargesheet Against Jagan government : వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన అనుభవించారని ఎన్డీయే కూటమి నేతలు విమర్శించారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా విధ్వంస పాలన సాగిందని తెలిపారు. అడుగడుగునా అరాచకం రాజ్యమేలింది. ఐదేళ్ల నరకానికి, ప్రజలు పడుతున్న సమస్యలకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని కూటని నేతలు స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ ఒక్కరి జీవితంలో మార్పు వచ్చింది లేదు ఏ ఒక్కరికీ న్యాయం జరిగింది లేదు, ఏ వర్గానికీ, కుటుంబానికీ న్యాయం జరగలేదన్నారు. రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి చిచ్చుపెట్టారన్నారు. కశ్మీర్ మాదిరి పరిస్థితులు తెచ్చారు. ఇలాంటి ప్రభుత్వం అవసరమా? అని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా కూటమిగా మీ ముందుకు వచ్చాం. రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజలను గెలిపించుకోవడానికి, మన బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే గత ఐదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సామాన్యుడు కడుపు నిండా తిండి తినే పరిస్థితి లేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. పన్నులు పెరిగాయి. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఉన్నాయా? జగన్ జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? రాష్ట్రంలో యువతకు జాబు రావాలి అంటే కచ్చితంగా కూటమి ప్రభుత్వం రావాల్సిందేనని నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలపై ఎన్డీయే కూటమి నేతలు చార్జ్ షీట్ విడుదలు చేస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Apr 25, 2024, 4:36 PM IST