వరదకు కకావికలమైన నాయకన్‌గూడెం - విలయానికి అద్దం పడుతున్న దృశ్యాలు - Nayakangudem Flooded Area Visuals
🎬 Watch Now: Feature Video
Nayakangudem Flooded Visual in Khammam : రాష్ట్ర వ్యాప్తంగా గత మూడ్రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెం వరదలకు కకావికలమైంది. పాలేరు ఉద్ధృతితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాయకన్‌గూడెంలో వరద తగ్గుముఖం తర్వాత బయటపడిన దృశ్యాలు విలయానికి అద్దం పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో కొట్టుకుపోయిన వాహనాలు బయటపడ్డాయి. వరద ఉద్ధృతితో రహదారులు సైతం కొట్టుకుపోయి చెల్లచెదురయ్యాయి.
Munneru Vagu Floods in Khammam : ఈ నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు కకావికలం అయ్యారు. కాలనీల్లోని రహదారులు ధ్వంసమయ్యాయి. వరద నీటితో కొట్టుకొచ్చిన చెత్తాచెదారంతో చిందరవందరగా ఉన్నాయి. మరోవైపు ఖమ్మంలోని మున్నేరు మహోగ్రరూపం దాల్చింది. ఎటు చూసినా వరద నీరుతో చెరువును తలపించింది. ముంపునకు గురైన ఇళ్లల్లో నిత్యావసరాలు సైతం వరదలో కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల ఇంటి గోడలు కూడా కూలిపోయాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు కకావికలం అయ్యారు. ఈ దృశ్యాలను చూస్తే హృదయం ద్రవించుకుపోవాల్సిందే.