ప్రభంజనంలా యువగళం- ఉత్సాహంగా పాల్గొంటున్న యువత - Nara Lokesh Yuvagalam Padayatra - NARA LOKESH YUVAGALAM PADAYATRA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 12:41 PM IST
Nara Lokesh Yuvagalam Padayatra Sate Wide Success : జగన్ అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా సమర భేరి మోగించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం ఉత్సాహంగా సాగుతోంది. యువగళం సభలు నిర్వహిస్తున్న ప్రతిచోట యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఐదేళ్లపాలనలో తాము అనుభవించిన కష్టాలను యువతీ, యువకులు లోకేశ్‌తో పంచుకుంటున్నారు. మరో నెలలో ప్రజా ప్రభుత్వం వచ్చాక కష్టాలు తీరుస్తామని యువనేత భరోసా ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో యువత పోషించాల్సిన పాత్రపై దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇప్పటికే ఒంగోలు, నెల్లూరు, చంద్రగిరి, నంద్యాలలో యువగళం సభలు పూర్తి కాగా, ఈ రోజు సాయంత్రం రాజంపేట గవర్నమెంట్ జూనియర్ కళాశాల పక్కన ప్రాంగణంలో సభ జరగనుంది. 5న ఏలూరు సభలో, 6న రాజమండ్రిలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే కార్యక్రమానికి హాజరవుతారు. 7న విజయనగరం యువగళం సభలో పాల్గొంటారు. 8వ తేదీన ప్రధాని మోదీ పాల్గొనే పీలేరు సభలో లోకేశ్ పాల్గొంటారు.