LIVE: తాడేపల్లిలో మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశం - ప్రత్యక్షప్రసారం - nara Brahmini At Mangalagiri - NARA BRAHMINI AT MANGALAGIRI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 5:31 PM IST
|Updated : Apr 20, 2024, 6:31 PM IST
Nara Lokesh Wife Brahmini At Mangalagiri Election Campaign Live: మంగళగిరి రూపురేఖలు మారాలంటే టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్‌ను గెలిపించాలని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ప్రజలను కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే మంగళగిరికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామన్నారు. మంగళగిరి చేనేత వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు అంతర్జాతీయ గర్తింపు రావాలంటే టీడీపీ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటికి తాగు నీరందించే పథకాన్ని తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. సంక్షేమానికి పెద్దపీట వేసే టీడీపీకి ఓటేసి గెలిపించాలని బ్రాహ్మణి కోరారు. ఈ నెల 18వ తేదీన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లి ఆర్వోకు లోకేశ్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా గ్రూపులతో ముఖాముఖి చేపట్టిన నారా బ్రాహ్మణి ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Apr 20, 2024, 6:31 PM IST