LIVE పెందుర్తిలో నారా లోకేశ్ శంఖారావం సభ - ప్రత్యక్ష ప్రసారం - Nara Lokesh Shankaravam Yatra Live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 11:22 AM IST
|Updated : Feb 17, 2024, 3:54 PM IST
Nara Lokesh Shankaravam Yatra Live : చొక్కా చేతులు మడతపెడతామంటూ సీఎం జగన్ గూండాగిరీ చేయాలనుకుంటున్నారా అంటూ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు చొక్కాలు మడత పెడితే, పసుపు సైనికులు కుర్చీలు మడత పెడతారని హెచ్చరించారు. ఇన్నాళ్లూ మూడు ముక్కలాట ఆడిన వైఎస్సార్సీపీ నేతలు, ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించమంటూ కొత్త నాటకానికి తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారందరిపైనా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.
శుక్రవారం నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం బహిరంగ సభల్లో నారా లోకేశ్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పాలనపై రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ఏ ఇంటికెళ్లి అడిగినా ఇదే మాట చెబుతారని, ఈ అంశంపై ఇంటింటికీ వెళ్లేందుకు వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
మద్యం దుకాణాల వద్దకైనా వచ్చేందుకు సిద్ధమని, జగన్‌కు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారుచేసి మహిళల తాళిబొట్లు తెంపుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని గాలికొదిలేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడుతున్న జగన్ ప్రభుత్వంపై కుర్చీలు మడత పెట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని లోకేశ్ హెచ్చరించారు.
పెందుర్తిలో నారా లోకేశ్ శంఖారావం బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారం మీ కోసం