LIVE: టెక్కలిలో నారా లోకేశ్ శంఖారావం యాత్ర - ప్రత్యక్ష ప్రసారం - LOKEsH Shankaravam Tekkali

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 6:10 PM IST

Updated : Feb 11, 2024, 7:19 PM IST

Nara Lokesh Sankharavam Yatra Live : సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేయటంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నింటికీ భరోసా కల్పించేలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రకు సిద్ధమయ్యారు. శంఖారావం యాత్ర ఇచ్ఛాపురంలో ప్రారంభమైంది. ఇచ్ఛాపురం రాజావారి గ్రౌండ్స్‌ ప్రారంభ సభలో లోకేశ్‌ ప్రసంగించారు. ఆపై వార్డు స్థాయి నుంచి నియోజకవర స్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించి సూపర్‌-6 కిట్ల అందజేశారు. ఉదయం 'సెల్ఫీ విత్‌ లోకేశ్' కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆయా నియోజకవర్గాల్లో 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ', 'మన టీడీపీ యాప్‌'లో ప్రతిభ కనబరిచిన కార్యకర్తల్ని అభినందించారు. తెలుగుదేశం పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ తరహా కార్యక్రమాల్నే రూపొందించారు.

ప్రస్తుతం పలాసలో శంఖారావం యాత్ర కొనసాగుతోంది. సాయంత్రం టెక్కలిలోనూ కొనసాగనుంది. అనంతరం రాత్రికి నరసన్నపేటలోని జమ్ము గ్రామ శివారులో ఆయన బస చేస్తారు. ప్రస్తుతం ఇచ్ఛాపురంలో నారా లోకేశ్ శంఖారావం యాత్ర సాగుతోంది. ప్రత్యక్ష ప్రసారం మీ కోసం 

Last Updated : Feb 11, 2024, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.