శ్రీవారి సేవలో నారా కుటుంబం - మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడిని పరామర్శించిన లోకేష్‌ దంపతులు - Nara Lokesh Family Visit Tirumala - NARA LOKESH FAMILY VISIT TIRUMALA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 10:19 PM IST

Nara Lokesh Family Visit Tirumala Temple : నారా లోకేష్ దంపతులు, భువనేశ్వరిల తిరుమల పర్యటన ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నారా లోకేష్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న నారా కుటుంబానికి తితిదే అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో నారా కుటుంబం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దేవాన్ష్​కు ఆయురారోగ్యాలు కలగాలని శ్రీవారిని ప్రార్థించారు. రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

అనంతరం అక్కడ నుంచి నేరుగా వెంకమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నవితరణకు 38లక్షల రూపాయలు విరాళమిచ్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు రాజును నారా లోకేష్‌ దంపతులు పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను నారా లోకేష్‌ దంపతులు పరామర్శించారు. ఎన్టీఆర్ సినిమాలు చేస్తున్నప్పటినుంచి రాజు​ పిచ్చి అభిమాని. స్వర్గీయ నందమూరి తారకరామారావు తనకు ధర్మకర్తల మండలి సభ్యుడిగా అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించి వారితోపాటు అన్న ప్రసాదాలను స్వీకరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.