LIVE ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు- విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం - CM in TOURISM DAY CELEBRATIONS - CM IN TOURISM DAY CELEBRATIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2024, 8:30 PM IST
|Updated : Sep 27, 2024, 9:04 PM IST
Nara Chandrababu Naidu will Participate in WORLD TOURISM DAY CELEBRATIONS - 2024 LIVE : నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షత వహింస్తున్నారు. పర్యాటకం, శాంతి అనే థీమ్‌తో వరల్డ్ టూరిజం డే-2024 నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా పర్యాటక రంగానికి సంబంధించిన 38 విభాగాల్లో అవార్డుల ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక, చారిత్రక, ప్రకృతి ప్రసాదిత రమణీయ దృశ్యాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఉండవల్లి గుహలు, ప్రకాశంబ్యారేజీ అందాలు, అమరావతి ధ్యానబుద్ధ విగ్రహం, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, ఉప్పలపాడు పక్షుల కేంద్రం, కొండవీడు కోట, గుత్తికొండ బిలం, దైద అమరలింగేశ్వరస్వామి, కోటప్పకొండ, నాగార్జునసాగర్ కొండ, అనుపు, సూర్యలంక తదితర ప్రాంతాలతో పాటు ఎకో టూరిజం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ప్రకృతి రమణీయత మధ్య ప్రవహించే కృష్ణానది బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఆకట్టుకునే బీచ్‌లు జిల్లాకు పర్యాటకంగా అదనపు సొబగులు అద్దుతున్నాయి. అయితే ఆయా ప్రాంతాల్లో వసతులు మెరుగుపరిచి పర్యాటక అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Last Updated : Sep 27, 2024, 9:04 PM IST