జాతీయ రహదారిపై కారు పల్టీ- టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూఖ్ సేఫ్ - NMD Farooq car accident - NMD FAROOQ CAR ACCIDENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 7:32 PM IST
Nandyala TDP MLA Candidate NMD Farooq Car Accident : నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూఖ్ కారుకు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పాణ్యం మండలం తమ్మరాజు పల్లె గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఎన్ఎండి ఫరూక్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, ఎన్ఎండి ఫరూఖ్ ఈరోజు మధ్యాహ్నం నంద్యాల నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. సరిగ్గా తుమ్మరాజు పల్లె సమీపంలోకి రాగానే ఫరూక్ కారుకు గేదెలు అడ్డు వచ్చాయి. ఒక్కసారిగా రహదారిపైకి బర్రెలు దూసుకు రావడంతో వేగంగా వెళుతున్నకారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వెంటనే కారులో ఉన్న ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే అభర్థి గౌరీ చరిత ప్రమాద స్థలానికి చేరుకుని ఫరూఖ్‌ను పరామర్శించారు. తరువాత ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంతో వాహనం ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది.