ఎగువ నుంచి పెరిగిన ఇన్‌ఫ్లో - సాగర్ 2 గేట్లు ఎత్తిన అధికారులు - Nagarjuna Sagar Project Gates Open - NAGARJUNA SAGAR PROJECT GATES OPEN
🎬 Watch Now: Feature Video
Published : Aug 14, 2024, 9:16 PM IST
|Updated : Aug 14, 2024, 10:04 PM IST
Nagarjuna Sagar Project Gates Open Today : నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను అధికారులు మరోసారి ఎత్తారు. జలాశయం ప్రస్తుతం నిండుకుండను తలపిస్తుంది. ఎగువ నుంచి ప్రవాహం కొనసాగడంతో ప్రాజెక్ట్ 2 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 63,123 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం- 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.00 టీఎంసీల గానూ.. 312.00 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
3 రోజుల క్రితం వరకు ఎగువ నుంచి ప్రవాహం రావడంతో 24 గేట్లను, ఆ తరువాత 18 గేట్లను ఎత్తి నీటి విడుదల చేశారు. ఆ సమయంలో కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులు భారీగా సాగర్‌కు క్యూ కట్టారు. తరువాత ఇన్ ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేశారు. ఇప్పుడు మళ్లీ 2 గేట్లు ఎత్తడంతో సాగర్ వద్ద పర్యాటకుల సందడి మొదలు కానుంది. రేపటి నుంచి సోమవారం వరకు సెలవులే కావడంతో రద్దీ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి