నిండుకుండను తలపిస్తున్న నాగార్జునసాగర్ జలాశయం - రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల - Nagarjuna Sagar Project Gates Open - NAGARJUNA SAGAR PROJECT GATES OPEN
🎬 Watch Now: Feature Video
Published : Aug 25, 2024, 11:30 AM IST
Nagarjuna Sagar Project Gates Open : ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. వరద పెరగడంతో రెండు క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రస్తుత, పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. జలాశయం ప్రస్తుత, పూర్తి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి ఇన్ఫ్లోగా 64000 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తోంది. అంతే మొత్తంలో ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 28వేల క్యూసెక్కుల నీరు, సాగర్ కుడి ఎడమ కాలువలకు సాగునీరు 16వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సాగర్ నిండుకుండలా మారడంతో ఈ నెలలో మూడో సారి గేట్లను ఎత్తారు. మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 31,202 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1083 అడుగులుగా నమోదైంది.