మంత్రి రోజాకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదు: నగరి వైఎస్సార్సీపీ నేతలు - మంత్రి రోజాపై తీవ్రమవుతున్న అసమ్మతి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-03-2024/640-480-20894012-thumbnail-16x9-ycp-leader.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 3, 2024, 12:38 PM IST
Nagari and Puttur Leaders Opposing Minister Roja : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి రోజాపై అసమ్మతి స్వరాలు తీవ్రమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని మండలాలతో పాటు నగరి, పుత్తూరు నేతలు రోజా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోజాను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నేతలు బహిరంగ విమర్శలు చేయడంతో పాటు తమ మండలాల పరిధిలో మంత్రి ప్రమేయం లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ధిక్కార స్వరాన్ని పెంచుతున్నారు. ఈసారి మంత్రి రోజాకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని బాహాటంగా హెచ్చరిస్తున్నారు.
ఇటీవల రూ. 50 లక్షల తుడా నిధులతో రోజా అన్న రామ్‌ప్రసాద్ రెడ్డి కాలువల పనులకు భూమిపూజ చేయడం ఎంత వరకు సమంజసమని వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి ప్రశ్నించారు. తమ నియోజకవర్గంలో రోజా అన్నదమ్ములు ప్రభుత్వ కార్యక్రమాలకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేయవచ్చు తాము చేయకూడదా? అని వ్యాఖ్యానించారు. తాము మంత్రి రోజాను వ్యతిరేకిస్తున్నామే తప్ప పార్టీని కాదన్నారు. మంత్రి రోజాపై నిండ్ర, నగరి, పుత్తూరు, వడమాలపేటలో అసంతృప్తి ఉందని తెలిపారు.