వెల్లివిరిసిన మత సామరస్యం : గణేశుడి సేవలో ముస్లిం సోదరుడు - 216 కిలోల లడ్డూ సమర్పణ - Muslim Gave 216kg Laddu to Ganesh - MUSLIM GAVE 216KG LADDU TO GANESH

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 12:51 PM IST

Muslim Gave 216kg of Laddu to Ganesha in Warangal : వినాయకుడి సేవలో ఓ ముస్లిం సోదరుడు అన్నీతానై ఆ వాడలో ఉన్న హిందువులతో కలిసి ఎంతో వైభవంగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. లంభోదరుడికి ఏకంగా 216 కిలోల లడ్డూను సమర్పించి, తన దైవభక్తిని చాటుకుంటున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తూజిపేట గ్రామంలో రియాజ్ ఏఆర్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నాలుగు సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలను తన సొంత డబ్బులతో నిర్వహిస్తున్నాడు. 

గతం వారం రోజులుగా వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. 216 కిలోల లడ్డూను తయారు చేయించి శనివారం డప్పు, వాయిద్యాలు, కోలాటాల నడుమ అడుగడుగునా కొబ్బరికాయలు కొడుతూ వినాయక మండపానికి చేరారు. వినాయక నిమజ్జనం తర్వాత స్వయానా గ్రామ ప్రజలందరికీ లడ్డూను పంచుతామని తెలిపారు రియాజ్. ఈ విధంగా చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని, హిందు - ముస్లిం వేరు కాదని, అందరూ ఒక్కటేనని తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.