కర్నూలు జిల్లాలో దారుణం- కోర్టు సమీపంలోనే వ్యక్తిపై హత్యాయత్నం - Yemmiganur court
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 5:40 PM IST
Murder Attempted at Court in Yemmiganur of Kurnool District : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కోర్టు సమీపంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని కోర్టు సమీపంలోనే విచక్షణారహితంగా నరకడం కలకలం సృష్టించింది. అనంతపురం జిల్లా కనగానపల్లెకు చెందిన వీరనారాయణ చెక్కు బౌన్స్ కేసులో కోర్టుకు హాజరయ్యారు. వీరనారాయణ కోర్టు నుంచి బయటకు వస్తుండగా కేసు వేసిన వీరన్న మాటువేసి ఒక్కసారిగా వేటకొడవలితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని గమనించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈరన్న దాడిలో తీవ్రంగా గాయపడిన వీరనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. కోర్టు సమీపంలోనే ఈ దాడి జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాడి చేసిన వీరన్న కర్నూలు జిల్లా సి.బెళగల్‌కు చెందిన వ్యక్తి. ఇతను అల్యూమినియం వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులున్నాయని తెలిపారు.