చీరాల మున్సిపల్ సమావేశంలో వివాదం- బాయ్‌కాట్ చేసిన కౌన్సిలర్
🎬 Watch Now: Feature Video
Muncipal Meeting Dispute In Bapatla District : బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కార్యక్రమం (Programme) నుంచి వార్డ్ కౌన్సిలర్ ప్రభాకర్ బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు. చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కరణం బలరాం వర్గానికి చెందిన 16వ వార్డు కౌన్సిలర్ (Counselor) ప్రభాకర్, 17 వ వార్డు కౌన్సిలర్ బాలక్రిష్ణ, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి చెందిన 25 వ వార్డ్ కౌన్సిలర్ సురేష్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
స్థానిక మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముఖ ద్వారం, పార్కు, జిమ్‌లకు, స్థల దాతల పేర్లు పేట్టాలని కౌన్సిల్లో ప్రభాకర్ ప్రతిపాదించారు. అయితే 120 ఏళ్ల చరిత్ర గల హైస్కూల్ అవరణలో నిర్మిస్తున్న వాటికి దాతల పేర్లు ఎలా పెడతారంటూ పలువురు ఎదురు ప్రశ్నించారు. సభ్యుల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో చైర్మన్ శ్రీనివాసరావు కలగజేసుకుని ఇరువైపులా వారికి సర్ది చెప్పారు. ఎంత నచ్చజెప్పినా వినకుండా ప్రభాకర్ సమావేశం (Meeting) మధ్యలోనే వెళ్లిపోయారు.