విజయవాడలో ముద్రగడ ముఖ్య అనుచరుల సమావేశం- కూటమికే కాపు నేతల మద్దతు - Mudragada fans Support to NDA - MUDRAGADA FANS SUPPORT TO NDA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 12:32 PM IST
Mudragada Padmanabham Followers Support to NDA Alliance : రాష్ట్రంలో జగన్‌కు వ్యతిరేకంగా, ఎన్డీఏ కూటమికి మద్దతుగా పని చేయాలని కాపు, బలిజ, ఒంటరి సంఘాలు తీర్మానించాయి. విజయవాడలో ముద్రగడ పద్మనాభం ముఖ్య అనుచరులు సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. గత తెలుగుదేశం హయాంలో కాపుల కోసం అనేక పథకాలు అమలు చేసి చంద్రబాబు తమకు వెన్నుదన్నుగా నిలిచారని, జగన్ వెన్నుపోటు పొడిచారని కాపు, బలిజ, ఒంటరి వర్గాల కన్వీనర్ వాసిరెడ్డి ఏసుదాస్ మండిపడ్డారు. జగన్ కాపులను అణగ దొక్కారని ధ్వజమెత్తారు. జగన్ కాపులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓటు చీలకుండా రాష్ట్ర మంచి కోసం మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిశారన్నారు. జగన్ ఎవరికి ఎంత మేర న్యాయం చేశారో చెప్పగలరా అని కాపు సంఘాల కన్వీనర్ ఆరేటి ప్రకాష్ ప్రశ్నించారు. జగన్ పాలన అంతా అవినీతిమయమయ్యిందని, ప్రజలను ఉద్దరించినట్లు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందని, రాష్ట్రం మొత్తం కాపులు కూటమికే ఓటు వేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు.