కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరిన మహిళా ఎంపీటీసీ మృతి- సిబ్బంది నిర్లక్ష్యమే కారణమన్న బంధువులు - ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 9:16 PM IST
MPTC Died due to Doctors Negligence in Govt Hospital: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ అత్యంత దయనీయంగా మారింది. ఆసుపత్రలలో వసతుల లేమితో పాటు వైద్యుల నిర్లక్ష్యంతో అనేక మంది ప్రాణాలు పోతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Government Hospital) సాధారణ ప్రజలకే కాదు ప్రజాప్రతినిధులకు కూడా వైద్యం అందని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సమయానికి వైద్యులురాక , వైద్యులు ఉన్నా సక్రమంగా పనిచేయక ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంది. తాజాగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో (Kakinada Government General Hospital) ఇటువంటి నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల ఒక ప్రజాప్రతినిధి నిండు ప్రాణం కోల్పోవల్సిన దుస్థితి ఏర్పడింది. రెండు రోజుల క్రిందట అనారోగ్యంతో కిర్లంపూడి మండలం పాలేం సూరంపేట ఎంపీటీసీ బొడ్డేటి లక్ష్మీ (MPTC Boddeti Lakshmi) ఊపిరితిత్తుల సమస్యతో కాకినాడ ప్రభుత్వసామాన్యఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు నిర్లక్ష్యంతో ఆమె ప్రాణాలు కోల్పోవల్సి వచ్చిందని కుటుంబసభ్యులు ,బంధువులు ఆరోపిస్తున్నారు.