వచ్చే ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తా - రెండు రోజుల్లో గుడ్ న్యూస్: రఘురామ - RRR COMMENTS ON CONTESTING - RRR COMMENTS ON CONTESTING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 9:28 PM IST
MP Raghurama Raju Comments on Contesting Election: ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే మంచి వార్త వింటానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు (MP Raghu Rama Krishna Raju) ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తానని రఘురామ కృష్ణరాజు తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు తెలుగుదేశం శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా ? లేదా ఎంపీగా పోటీ చేస్తానా ? అనే విషయం తెలియదని అన్నారు. కానీ ఇంకో రెండు రోజుల్లో కచ్చితంగా తాను, ప్రజలు మంచి వార్త వింటారని అన్నారు. ఇప్పటి వరకు తమకు తెలుగుదేశం, బీజేపీ నుంచి ఎటువంటి సమాచారం లేదని రఘురామ అన్నారు. త్వరలో జగన్ గద్దె దిగడానికి సిద్ధంగా ఉండాలని, జరగబోయే ఎన్నికలలో కచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.