పోలీసులనే బోల్తా కొట్టించిన పెట్రోల్ బంక్ క్యాషియర్ - రూ.12 లక్షల నగదుతో జంప్ - Money Robbery In kodada Petrol bunk
🎬 Watch Now: Feature Video
Published : Mar 16, 2024, 11:20 AM IST
Money Robbery In kodad Petrol Bunk : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ క్యాషియర్ హనుమారెడ్డి పోలీసులను బోల్తా కొట్టించాడు. బంక్‌కు చెందిన రూ. 12 లక్షల నగదును తీసుకుని కనిపించకుండా పారిపోయాడు. స్టేషన్‌కి పక్కనే ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులో గత కొంత కాలంగా హనుమారెడ్డి క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు వచ్చే సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసి స్లిప్పులను సంబంధిత అధికారికి అందిస్తారు.
Money Theft In Kodad Petrol Bunk : ఇదే క్రమంలో పెట్రోల్ బంక్‌కు వచ్చిన డబ్బులను డిపాజిట్ చేయాలని అధికారులు ఆయనకు రూ. 12 లక్షల రూపాయలు ఇచ్చి బ్యాంకుకు పంపించారు. ఇదే అదునుగా భావించిన హనుమారెడ్డి నగదుతో పారిపోయాడు. రెండు రోజులుగా పెట్రోల్ బంకుకు రాకపోవడం డబ్బులు కూడా డిపాజిట్ చేయకపోవడంతో విచారణ చేపట్టిన అధికారులు అతను పారిపోయినట్టుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.