ఒంగోలులో రీకౌంటింగ్‌కు పట్టు - వెరిఫికేషనే చేస్తామన్న కలెక్టర్ - నిలిచిన మాక్‌పోలింగ్ - EX MLA Balineni Srinivas Complaint - EX MLA BALINENI SRINIVAS COMPLAINT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 19, 2024, 2:27 PM IST
Mock Polling Stopped in Ongole : ఒంగోలు అసెంబ్లీ స్థానంలో ఈవీఎంల మాక్ పోలింగ్ నిలిచింది. వైఎస్సార్సీపీ ప్రతినిధులు రీకౌంటింగ్ చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. ఈసీ ఆదేశాల మేరకు వెరిఫికేషన్ మాత్రమే చేస్తామని కలెక్టర్ తేల్చి చెప్పారు దీంతో మాక్ పోలింగ్ నిలిచింది.
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదుతో ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలు సక్రమంగా జరగలేదని బాలినేని ఫిర్యాదుతో 4 రోజుల పాటు మాక్ పోలింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఒంగోలులోని ఈవీఎం గొదాముల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ జరుగుతోంది. తొలి రోజు మూడు ఈవీఎంల్లో మాక్ పోలింగ్ చేస్తున్నారు. అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ వైఎస్సార్సీపీ నేతలు ఆలస్యంగా రావడంతో కలెక్టర్ లేటుగా ప్రారంభించారు.
EX MLA Balineni Srinivas Complaint To EC : వైఎస్సార్సీపీ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూటమిపై ఉన్న నమ్మకంతో దామచర్ల జనార్దన్‌కు ప్రజలు పట్టం కట్టారు. దీనికితోడూ నగరంలో ఆయన అంతకుముందు చేపట్టిన అభివృద్ధి పనులు వెరసి ఈ ఆదరణ లభించినట్లైంది. అయితే ఓటింగ్ సరళి, ఈవీఎంలపై తనకు అనుమానాలున్నట్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్న సంగతి తెలిసిందే.