ప్యాంట్ పాకెట్లో పేలిన మొబైల్ - చివరికి ఏం జరిగిందంటే? - phone exploded in pant pocket - PHONE EXPLODED IN PANT POCKET
🎬 Watch Now: Feature Video
Published : Aug 14, 2024, 3:57 PM IST
Mobile Phone Exploded in a Pant Pocket in Pitlam : మనం అప్పుడప్పుడు మొబైల్ ఫోన్ పేలిన ఘటనల వార్తలు వింటూ ఉంటాం. తాజాగా ఇటువంటి ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ప్యాంట్ జేబులో పెట్టుకున్న మొబైల్ ఒక్కసారిగా పేలడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటన పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన సాయిలుకు ఎదురైంది. ప్యాంటు పాకెట్లో ఉన్న మొబైల్ నుంచి ఒకేసారి శబ్దం రాగా, ఫోన్ తీసేలోపే మంటలు అంటుకుని ప్యాంటు పాకెట్ కాలిపోయింది.
అయితే ఈ ప్రమాదంలో వ్యక్తికి ఎలాంటి హాని కలగలేదు. ఫోన్ ఇలా ఎందుకు పేలిందని స్థానికులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా ఎండ వేడిమిని తట్టుకోలేక మొబైల్ ఫోన్లు పేలుతుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఎండలో బాగా ఫోన్‌ను ఉపయోగించడం వల్లగానీ, లేదా ఫోన్ కంపెనీకి సంబంధించిన ఛార్జర్ కాకుండా వేరే ఛార్జర్‌ను ఉపయోగించడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతుంటాయని వారు చెబుతున్నారు.