LIVE : హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - MLC Kavitha press meet hyd live
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2024/640-480-20696601-thumbnail-16x9-kavitha-live.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 8, 2024, 10:11 AM IST
|Updated : Feb 8, 2024, 10:17 AM IST
MLC Kavitha Live : సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలకు ఎంపికైన 441 మందికి బుధవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నియామకపత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురి ఉద్యోగాలు ఊడగొట్టేందుకు కృషిచేసిన నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. సింగరేణి నుంచి కొనుగోలు చేసిన బొగ్గుకు సొమ్ములు చెల్లించకుండా సంస్థ ఖాయిలా పడే పరిస్థితిని కేసీఆర్ సర్కార్ కల్పించిందని ఆరోపించారు. కేంద్రం గనులను ప్రైవేట్‌పరం చేస్తూ సంస్థ మనుగడను దెబ్బతీస్తున్నా అప్పటి పాలకులు ప్రశ్నించలేదని విమర్శించారు. ఇతర సమస్యల పరిష్కారంలోనూ పదేళ్లుగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని అన్నారు. సింగరేణి ఎన్నికల్లోనూ కార్మికులు కారు పార్టీకి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. పోలైన 38,000 ఓట్లలో బీఆర్ఎస్కు చెందిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి 1,298 ఓట్లు మాత్రమే దక్కాయని వివరించారు. తద్వారా గులాబీ పార్టీ అక్కడ స్థానం లేదని తేల్చి చెప్పారని రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నిన్న రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.