విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం దర్యాప్తు చేయించాలి : ఎమ్మెల్సీ కవిత - Gurukula Student Asmitha
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-02-2024/640-480-20798647-thumbnail-16x9-mlc-kavitha.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 20, 2024, 7:23 PM IST
MLC Kavitha on Gurukul Students Issues : రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలపై ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. విద్యాశాఖకు మంత్రిని నియమించి వ్యవస్థను పటిష్ఠం చేయాలని సూచించారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్లలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గురుకుల పాఠశాల విద్యార్థిని ఆష్మిత కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు.
MLC Kavitha Visited To Gurukula Student Asmitha : ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రితో పాటు, సంక్షేమ శాఖ మంత్రులను పూర్తి స్థాయిలో నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి హాస్టల్లో సైకాలజిస్ట్‌లను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని కల్పించాలన్నారు. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేలా విద్యార్థులను తయారు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆత్మహత్యలపై సమీక్ష చేసి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థికసాయం ఇవ్వాలని కోరారు.