కాంగ్రెస్ పార్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది : కల్వకుంట్ల కవిత - MLC Kavitha Latest Comments
🎬 Watch Now: Feature Video
Published : Jan 25, 2024, 3:02 PM IST
MLC Kavitha Fires On Congress In Jagtial : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో పాలనలో పరిపాలన సాఫీగా సాగిందన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కరెంట్, త్రాగునీరు రావడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వానికి సమస్యలు విన్నవిస్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
MLC Kavitha Comments On Jivan Reddy : జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షపూరితంగా వెంటపడుతున్నాడని దీనిని ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని, రాష్ట్రంలో ఆడపిల్లలకు, విద్యార్థులకు, రైతులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దని వారికి పార్టీ నిరంతరం అండగా నిలుస్తుందని కార్యకర్తల్లో భరోసా నింపారు.