ఐటీ, పారిశ్రామిక అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్​గా గన్నవరం : ఎమ్మెల్యే యార్లగడ్డ - Yarlagadda on Gannavaram Devlopment - YARLAGADDA ON GANNAVARAM DEVLOPMENT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 3:03 PM IST

MLA Yarlagadda Interview :  రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కృష్ణా జిల్లా గన్నవరం ముఖ ద్వారం కాబోతోంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఐటీ కంపెనీని గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయించే దిశగా చర్చలు సాగుతున్నాయి. తద్వారా మేథాటవర్స్​లోని ఐటీ సెజ్​కు ఊపు తీసుకొచ్చే ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. గత ఐదేళ్ల నిరాదరణతో నిరాశ చెందిన అశోక్ లేలాండ్ పరిశ్రమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో తమ కార్యలాపాలను పునఃప్రారంభించేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. 

Gannavaram Industrial Development : మల్లవల్లి పారిశ్రామికవాడలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు తీసుకున్న వారంతా ప్రభుత్వ మార్పుతో త్వరిగతిన తమ యూనిట్లను మొదలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో వారు వరుస సంప్రదింపులు జరుపుతున్నారు. కర్ణాటకలోని హోసూరు తరహాలో నియోజకవర్గంలోని గన్నవరం, మల్లవల్లి, వీరపనేనిగూడెం తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు మెరుగుపరిచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. స్పష్టమైన పారిశ్రామిక విధానం ద్వారా ఉపాధి కల్పనే లక్ష్యంగా కృషి చేస్తోంది. మరి రానున్న రోజుల్లో గన్నవరం దశ- దిశ ఎలా మారబోతోంది? ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై ఆ ప్రాంత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుతో మా ప్రతినిధి శ్రీనివాస మోహన్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.