ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అంకితభావం - సొంత ఇల్లు కూల్చివేతకు సహకారం - MLA Demolished His House

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 4:02 PM IST

MLA Venkataramana Reddy Demolished His House : ప్రజలకు మంచి చేసే క్రమంలో నష్టం జరిగితే, ఆ నష్టం తన నుంచి మొదలు కావాలంటున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని, మాజీ సీఎంని ఓడించి, దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి. తాజాగా తాను చేపట్టిన ఓ కార్యక్రమం, ప్రజాసేవలో ఆయనను మరో మెట్టెక్కించింది. ఇవాళ కామారెడ్డి పట్టణంలో రోడ్ల విస్తరణపై ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

Kamareddy MLA Demolished his House for Road : ఈ నేపథ్యంలో అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, రోడ్డు విస్తరణకు తన ఇల్లు కూడా అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. చెప్పిందే ఆలస్యం అన్నట్టుగా ఇల్లును ఖాళీ చేసి, మరోచోటుకు మారిన వెంకట రమణారెడ్డి, అధికారులతో కలిసి తన ఇంటిని కూల్చివేయించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ల విస్తరణకు సహకరించాలని పట్టణప్రజలను కోరారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై నిర్మించిన ఇంటి యజమానులకు నోటిసులిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.