హరీశ్ రావుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించం : కొత్త ప్రభాకర్ రెడ్డి - MLA Prabhakar reddy about HarishRao
🎬 Watch Now: Feature Video
Published : Jan 25, 2024, 5:53 PM IST
MLA Prabhakar reddy on Congress : దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అర్థంలేని ఆరోపణలు చేయడం, ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి, తొగుట మండలాల్లో ఆయన ఇవాళ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తొగుట మండల పరిధి జప్తిలింగారెడ్డిపల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ భవనాలను, లింగంపేటలో నీటి శుద్ధి కరణ కేంద్రాన్ని, మిరుదొడ్డి మండలం కాసులాబాదులో మహిళా సమైక్య భవనం, ధర్మారంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
MLA Prabhakar reddy Fires on Raghunandan Rao : కాంగ్రెస్ నాయకులు పదేపదే బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తూ కక్షసాధింపు చేస్తున్నారు తప్ప అభివృద్ధి పనులపై దృష్టి సారించడంలేదని కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అర్థంలేని ఆరోపణలు చేయడం, ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.