విశాఖలో రోడ్డు ప్రమాదం - మానవత్వం చాటుకున్న టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు - MLA Palla Helped Injured Person - MLA PALLA HELPED INJURED PERSON
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 9:37 PM IST
MLA Palla Srinivasa Rao Helped Injured Person in Road Accident: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయాలైన బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే షీలానగర్ నుంచి గాజువాక వైపు వెళ్తున్న లారీకి అతివేగంగా ద్విచక్రవాహనం అడ్డుగా రావడంతో ఒక్కసారిగా లారీ ఆగింది. దీంతో అనుకోకుండా వెనక వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వెనక లారీ క్యాబిన్ మొత్తం ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌ను గాజువాక నుంచి విశాఖ వైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దగ్గరుండి ప్రమాదంలో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సాయంతో డ్రైవర్ని దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. పల్లా శ్రీనివాసరావు స్పందించి దగ్గరే ఉండి అన్ని పనులు చూసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.