ముచ్చర్లను నాల్గో నగరంగా ప్రకటించడం ద్వారా ఏం సంకేతాలు ఇచ్చారు : కాటిపల్లి - MLA katipally on CM Revanth Reddy - MLA KATIPALLY ON CM REVANTH REDDY
🎬 Watch Now: Feature Video
Published : Aug 3, 2024, 7:56 PM IST
MLA katipally Venkataramana Reddy Fires On CM Revanth Reddy : గత తొమ్మిది రోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు మాటల గారడీగా సాగాయని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు ఏ మాత్రం ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదని ఆక్షేపించారు. అదేవిధంగా మంత్రుల పనితీరు, మాటల తీరు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయిందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాసనసభా నిర్వహణ తీరుపై విమర్శలు గుప్పించారు. కేంద్ర నిధులు రాలేదని విమర్శలే తప్ప, కేంద్రం ఇచ్చిన నిధులపై వివరాలు లేవన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అక్షేపించారు. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్‌పై ఎదురు దాడికే ప్రాధాన్యత ఇచ్చిందే కానీ, ప్రజా సమస్యలు ప్రస్తావించలేదన్నారు. ముఖ్యమంత్రి అయితే ఒకసారి నిధులు లేవంటూనే, మరోవైపు వేరే పనులు చేపడతారని, ప్రజలకు ఉపయోగపడే పనుల గురించి అడుగుదామని తాము మైక్ అడిగితే ఇవ్వని పరిస్థితి ఉందని ఆరోపించారు. రైతులకు, నిరుద్యోగులకు, వీఆర్ఎస్, ఉద్యోగ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముచ్చర్లను నాల్గో నగరంగా ప్రకటించడం ద్వారా ఏం సంకేతాలు ఇచ్చారని ప్రశ్నించారు.