"కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే అంతా వారికే రాసిస్తా" - ఎమ్మెల్యే కాటాసాని రాంభూపాల్ కబ్జా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 9:34 PM IST
MLA Katasani Rambhupal Reddy: కర్నూలు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే తనపై వస్తున్న ఆరోపణలపై సవాల్ విసిరారు. తాను కబ్జాలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కొనసాగుతోందని, నిరూపిస్తే వాటిని స్థానిక టీడీపీ నేతలకు రాసిస్తానని అన్నారు. రాజకీయ జీవితాన్ని కూడా వదులుకుంటానని తేల్చి చెప్పారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తాను భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు. ఈ అంశంపై తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు ఆరోపించిన కబ్జా స్థలాల వద్దనే ఈ చర్చకు సిద్ధమని, అందుకు టీడీపీ నేతలు అధికారులతో చర్చలకు రావాలని సవాల్ విసిరారు. తాను కబ్జాలకు పాల్పడుతునట్లు తెలుగుదేశం నేతలు నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని అన్నారు. అంతేకాకుండా కబ్జాలను నిరూపిస్తే, కబ్జాల్లో తేలిన స్థలాలను టీడీపీ నేతలైన గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డిలకు రాసిస్తానని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు.