కేంద్రమంత్రులతో ఎమ్మెల్యే కన్నా భేటీ - పేరేచర్ల-కొండమోడు రోడ్డు విస్తరణకు గడ్కరీ అంగీకారం - MLA Kanna Met Central Ministers - MLA KANNA MET CENTRAL MINISTERS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 10:16 AM IST

MLA Kanna Lakshmi Narayana Met Central Ministers : గుంటూరు జిల్లాలోని పేరేచర్ల – కొండమోడు రోడ్డు విస్తరణకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) అంగీకరించారని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. సత్తెనపల్లి - నందిగామ ఎన్ఎస్‌పీ కెనాల్‌పై 4 లేన్ల రోడ్లు కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిచారని తెలిపారు. అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw)ను కలిశానని తెలిపారు. సత్తెనపల్లి మాదిపాడు మధ్యలో రైల్వే గేట్ ఉండటం వల్ల ప్రజలు చాలా  ఇబ్బందులు పడుతున్నారని, ఐదు మండలాల ప్రజలు సత్తెనపల్లికి రావాలంటే నానా అవస్థలు పడుతున్నారని మంత్రికి తెలియజేశానని, ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  

దిల్లీ వెళ్లిన కన్నా లక్ష్మీ నారాయణ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి నితిన్‌ గడ్కరీని కలిసారు. అనంతరం అశ్వినీ వైష్ణవ్‌తోనూ కన్నా భేటీ అయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు ఆయన వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.