సీఐని సస్పెండ్ చేస్తామని అధికారుల హామీ - ఆందోళన విరమించిన ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి - MLA Ashmit Reddy Protest Tadipatri - MLA ASHMIT REDDY PROTEST TADIPATRI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2024, 7:47 PM IST
MLA JC Ashmit Reddy Protest at Tadipatri Police Station : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి నిరసనకు దిగారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని సీఐ లక్ష్మీకాంత రెడ్డికి ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి ఫోన్ చేశారు.
దీంతో ఎమ్మెల్యేకు సీఐ లక్ష్మీకాంతరెడ్డి వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వు చెబితే నేను కేసు పెట్టాలా? అని అస్మిత్ రెడ్డిని సీఐ ప్రశ్నించారు. సీఐ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఠాణా వద్ద ఆందోళనకు దిగారు. అక్రమ ఇసుక రవాణా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ ని సస్పెండ్ చేయాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సీఐకు వ్యతిరేకంగా కార్యకర్తలు స్టేషన్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
ఆందోళన విరమించిన అస్మిత్ రెడ్డి : నాలుగు గంటలుగా ఆందోళన కొనసాగతుండగా, ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అక్రమ ఇసుక రవాణా పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ లక్ష్మీకాంతరెడ్డిని సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో జేసీ అస్మిత్‌రెడ్డి ఆందోళన విరమించారు. లక్ష్మీకాంతరెడ్డి ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని అస్మిత్‌రెడ్డి ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాదారులపై సీఐ కేసులు పెట్టట్లేదని అస్మిత్‌రెడ్డి ఆరోపించారు.