టీడీపీ గేట్లు తెరిస్తే వైఎస్సార్​సీపీ మొత్తం ఖాళీ- టీడీపీ విలువలు కలిగిన పార్టీ: ఎమ్మెల్యే గంటా - MLA Ganta Srinivasa Rao on YSRCP - MLA GANTA SRINIVASA RAO ON YSRCP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 4:38 PM IST

MLA Ganta Srinivasa Rao on YSRCP over Leaders Resignations: వైఎస్సార్​సీపీ మునిగిపోయే నావ అని ఈ విషయం ముందే చెప్పానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలరేమోనని సందేహం వ్యక్తం చేశారు. తాము గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని గంటా జోస్యం చెప్పారు. టీడీపీ విలువగల పార్టీ అని రాజీనామా చేసి వచ్చిన వారినే పార్టీలోకి స్వాగతిస్తామని స్పష్టం చేశారు.

MLA Ganta on Visakha Development: విశాఖ అభివృద్ధికి 'విజన్ డాక్యుమెంట్' సిద్ధమవుతోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వివరించారు. వైజాగ్​ను ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక సహా అన్నిరంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. వనరులను సక్రమంగా వినియోగించుకోవడంతోపాటు మౌలిక వసతులను పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. దార్శనిక పత్రాన్ని ఎలా రూపొందిస్తున్నారు అందులో ఏఏ అంశాలు పొందుపరిచారో ఎమ్మెల్యే గంటా వివరించారు. రాష్ట్రానికి ఆర్ధిక రాజధాని అయిన విశాఖని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సర్వ నాశనం చేసిందని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.