LIVE : అనుచరులతో కలిసి కౌశిక్​ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ - కొండాపూర్​లో తీవ్ర ఉద్రిక్తత - mla Kaushik Reddy House Live - MLA KAUSHIK REDDY HOUSE LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 12:25 PM IST

Updated : Sep 12, 2024, 1:20 PM IST

MLA Arekapudi Gandhi went to Kaushik Reddy House Live : ప్రస్తుతం ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి వర్సెస్​ అరెకపూడి గాంధీ నడుస్తోంది. సవాళ్లకు ప్రతి సవాళ్లు చేసుకుంటూ ఇద్దరూ క్షణక్షణం ఉత్కంఠను పెంచుతున్నారు. అరెకపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్​ఎస్​ కండువా కప్పుతా అని కౌశిక్​ రెడ్డి సవాల్​ విసిరారు. ఈ సవాల్​ను స్వీకరించిన అరెకపూడి గాంధీ నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా అంటూ ప్రతి సవాల్​ విసిరారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చేలరెగింది. అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కొండాపూర్​లోని కౌశిక్​ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాన్వాయ్​తో బయలుదేరి వెళ్లారు. కౌశిక్​రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 'మా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తామంటే ఖాళీగా ఉన్నామా?. కేసీఆర్​ అలాంటి వ్యాఖ్యలు చేస్తే స్వాగతించేవాడిని. నాతో పాటు ఉండే ఎమ్మెల్యేలు అడిగినా సమాధానం ఇచ్చేవాడిని. కౌశిక్​రెడ్డి నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా' అంటూ అరెకపూడి గాంధీ తెలిపారు.
Last Updated : Sep 12, 2024, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.