ఈ తాయిలాలు మీకు, మీ ఓట్లు మాకు: ఎమ్మెల్యే అనిల్ కుమార్ - Gifts presented by MLA at Pamarru

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 12:07 PM IST

MLA Anil Kumar Gifts To Media at Pamarru: ఓటర్లను ప్రభావితం చేయగలిగే అవకాశం ఉన్న వాళ్లెవరినీ వైఎస్సార్సీపీ నేతలు (YSRCP Leaders) వదలడం లేదు. సమావేశాలంటూ పిలవడం, విందు భోజనాలు పెట్టడం, ఇంటికి వెళ్లేటప్పుడు కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, స్మార్ట్‌వాచ్‌లు, చీరలు లాంటి తాయిలాల బాక్సులతో ఉన్న సంచులను చేతిలో పెట్టడం ఇది వైఎస్సార్సీపీ నేతల పని. వీటితో పాటు ఓ చిన్న కవర్‌లో డబ్బులు పెట్టి తమకు ఈ ఎన్నికల్లో ఓట్లను కురిపించాలంటూ ప్రాధేయపడుతున్నారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైఎస్సార్సీపీ రంగం సిద్ధం చేసింది. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ తన ఇంటి వద్ద ఆదివారం రాత్రి విలేకర్లకు విందు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం పరిధిలో సమీప మండలాలకు చెందిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా రిపోర్టర్లు హాజరయ్యారు. విందు అనంతరం వారికి నూతన వస్త్రాలు(పురుషులు, మహిళలకు), వెండి కుందులు తాయిలాలుగా (Gifts) ఎమ్మెల్యే అందించారు. అదే విధంగా నియోజకవర్గంలోని 205 మంది డ్వాక్రా బుక్‌ కీపర్లకు కొన్ని రోజుల నుంచి విందు ఏర్పాటు చేస్తూ కుక్కర్లు తాయిలాలుగా పంచుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.