కొట్టొచ్చినట్లు కనిపించిన అధికారుల నిర్లక్ష్యం - తప్పుల తడకగా గుంటూరు జిల్లా ఓటరు జాబితా
🎬 Watch Now: Feature Video
Mistakes in Guntur Voter List: సుమంత్ ముత్తినేని, తండ్రి పేరు స్వాతి నన్నపనేని. గంట గంట, ప్రశాంతి ప్రశాంతి ఎంటిది అనుకుంటున్నారా ? గుంటూరు జిల్లాలో ఓటరు జాబితా. జిల్లాలో కాకుమాను మండలం కొండపాటూరులో తుది ఓటరు జాబితాలో వెలుగులోకి వచ్చిన విషయాలు. ఇవి చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
బూత్ నెంబర్ 277 లో వరుస సంఖ్య 937 ఓటరు పేరు గంట గంట, ఇతరుల పేరుతో ప్రశాంతి ప్రశాంతి అని రెండు సార్లు నమోదు చేశారు. ఇదే బూత్ లో వరుస సంఖ్య 949లో ఓటరు పేరు సుమంత్ ముత్తినేని, తండ్రి పేరు స్వాతి నన్నపనేని అని రాశారు. ఓటరు ఫొటో వద్ద తాటి చెట్టు ఉండటం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పాలి. ఇదే బూత్‌లో చాలా మంది ఓటరు జాబితాలో ఫొటోల వద్ద ఆధార్ కార్డులు దర్శనం ఇస్తున్నాయి. కాకుమానులో 256 పోలింగ్ బూత్ జాబితాలో ఓటర్లు మృతి చెంది ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి ఓటర్లు గానే జాబితాలో పేర్లు కొనసాగుతున్నాయి. దాదాపు ఈ బూత్‌లో 20 మంది మృతులు ఓటర్లుగానే కొనసాగుతున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటన చేయలేదు అనడానికి ఇవే నిదర్శనమని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.