మూసీ అంశంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయవద్దు : మహేశ్​కుమార్‌ గౌడ్‌ - Public Face to Face with Ministers - PUBLIC FACE TO FACE WITH MINISTERS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 7:01 PM IST

Mahesh kumar Goud On Ministers Meet with People : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌ రెడ్డిలు ప్రజా పాలన ద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని నిర్మించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గాంధీ భవన్​లో రెండో రోజు ప్రజా పాలన కార్యక్రమానికి ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌, సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌ మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి హాజరయ్యారు. ప్రజలతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు వారు అందించే ఫిర్యాదులను స్వీకరించారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పూర్తైన అనంతరం మీడియాతో మాట్లాడిన మహేష్‌కుమార్‌ గౌడ్‌ తాజా రాజకీయ అంశాలపై స్పందించారు. ప్రజాభవన్‌లో ప్రజావాణీ, గాంధీభవన్‌లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతాయని తెలిపారు. 

ప్రజావాణి, మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం సత్వరం పరిష్కరిస్తోందని మహేష్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మూసీ అంశంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయవద్దంటూ హితవుపలికారు. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్‌ రూపురేఖలే మారతాయని ఆయన పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి ఇంటిపై దాడులు కక్షపూరితంగానే జరుగుతున్నాయని చెబుతున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌తో ఈటీవీ ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.