వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష- వరద ప్రాంతాల్లో ముందస్తు చర్యలకు ఆదేశం - Minister Anita Review on Rains - MINISTER ANITA REVIEW ON RAINS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 10:40 PM IST
Minister Vangalapudi Anita Review on Rains in AP: రాష్ట్రంలో అధిక వర్షాలపై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ను మంత్రి అనిత స్వయంగా పరిశీలించారు. ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ విధులను అధికారులు మంత్రి అనితకు వివరించారు.
హోంమంత్రిని కలిసిన మహిళా పోలీసు ఉద్యోగులు: సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీస్ ఉద్యోగులు హోమ్ మంత్రి అనితను కలిశారు. గందరగోళ పరిస్థితుల మధ్య తాము విధులు నిర్వహిస్తున్నామని వారు హోమ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. సచివాలయాల్లో పని చేస్తున్న తోటి ఉద్యోగుల నుంచి అవమానకర పరిస్తితులను ఎదుర్కొంటున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాతృ విభాగంగా డీజీపీ కార్యాలయం నుంచి కూడా ఎలాంటి ప్రత్యేక జాబ్ చార్టు లేదని, దీంతో తమకు మాతృత్వ సెలవలు కూడా లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటి పైనా చర్యలు తీసుకోవాలని అభ్యర్ధిస్తూ హోం మంత్రి అనితకు విజ్ఞాపనపత్రం ఇచ్చారు.