రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి : మంత్రి ఉత్తమ్ - Minister Uttam Kumar Tirumala Tour - MINISTER UTTAM KUMAR TIRUMALA TOUR
🎬 Watch Now: Feature Video
Published : Jun 17, 2024, 8:58 PM IST
Minister Uttam Kumar Tirumala Tour : నూతనంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉత్తమ్, తెలుగు జాతి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కోదాడ ఎమ్మెల్యే, తన శ్రీమతి పద్మావతి ఉత్తమ్ పుట్టిన రోజు పురస్కరించుకుని వారు శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు.
Minister Uttam Visited Tirupati : అలానే తిరుపతిలో పద్మావతి అమ్మవారి ఆలయాన్ని, శ్రీ కాళహస్తిలో వాయు లింగేశ్వర సహిత జ్ఞాన ప్రసూనాంబికా దేవి స్వామివార్ల దక్షిణామూర్తిని, పలు ఆలయాలను సందర్శించామన్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి విద్యుత్, జలాల మధ్య నెలకొన్న ఘర్షణలకుగానూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి వెల్లడించారు. తిరుమల పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్‌ను చూసిన పలువురు భక్తులు, ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు.