అకాల వర్షాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయి : మంత్రి ఉత్తమ్ కుమార్ - Minister Uttam Fires ON BRS Party - MINISTER UTTAM FIRES ON BRS PARTY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-09-2024/640-480-22528321-thumbnail-16x9-minister-uttam.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Sep 24, 2024, 5:09 PM IST
Minister Uttam Kumar Fires ON BRS Party : నీటిపారుదలశాఖలో గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాల్ని సరిచేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అకాల వర్షాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద నాగార్జున సాగర్ కాలువకు గండి పూడ్చివేత పనులను పరిశీలించారు. పనుల ఆలస్యం పట్ల ఖమ్మం జిల్లా ఎస్ఈపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేపటి కల్లా పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో గత యాభై ఏళ్ల చరిత్రలో ఇంతటి భారీ వర్షం ఎప్పుడూ పడలేదన్నారు. అయినా నష్టం జరిగిన మొదటి గంట నుంచి సీఎంతో సహా అందరం యుద్ధప్రతిపాధికన సహాయ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గత పాలకుల వైఫల్యం కారణంగా నీటిపారుదల శాఖ నిర్లక్షానికి గురైనట్లు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 700 మంది ఇంజినీర్లను, 1800 లస్కర్లను నియామకానికి సిద్ధం చేసినట్లు వివరించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా, బీఆర్ఎస్ పార్టీ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.