బీజేపీ గత పదేళ్లలో మతతత్వ రాజకీయం తప్ప చేసేందేమీ లేదు : మంత్రి ఉత్తమ్ - Minister Uttam on BJP
🎬 Watch Now: Feature Video
Minister Uttam Allegations on BJP : బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసేందేమీ లేదని, గత పదేళ్లలో మతతత్వ రాజకీయం చేసి మతాల మధ్య చిచ్చుపెడుతోందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. బీజేపీ ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడుతోందని మండిపడ్డారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో మేళ్లచెరువు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గత ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమంగా కేసులు పెట్టి పేదలను జైలు పాలు చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. హుజూర్‌నగర్‌ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు 15 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. బీజేపీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ఈ నెల 21న జరగబోయే హుజూర్నగర్ నియోజకవర్గం సమావేశానికి భారీ సంఖ్యలో హాజరుకావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.