పరిశ్రమలకు ఏపీ స్వర్గధామం-పెట్టుబడిదారులకు పూర్తి సహకారం: మంత్రి టీజీ భరత్ - Minister TG Bharat on Industries - MINISTER TG BHARAT ON INDUSTRIES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 8:04 PM IST

Minister TG Bharat on Setting up Industries in AP : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ (Industries Minister TG Bharat) తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామికవాడను ఆయన పరిశీలించారు. జైరాజ్ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఓర్వకల్లు నోడ్​లో అన్ని రకాల పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఓర్వకల్లులో మౌలిక వసతులు కల్పనకు కేంద్రం ముందుకు వచ్చిందని చెప్పారు. వైఎస్సార్​సీపీ నేతల వల్ల ఎన్నో పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పారిపోయిన పెట్టుబడిదారులు చంద్రబాబును చూసి రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి విజయవాడకు త్వరలో సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెబుతాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.