వరద సహాయక చర్యల్లో మానవతప్పిదాలకు తావు లేదు : శ్రీధర్ బాబు - Minister Sridhar Babu visit - MINISTER SRIDHAR BABU VISIT
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2024, 2:49 PM IST
Minister Sridhar Babu visit: భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు పర్యటించారు. జిల్లా సరిహద్దులోని పెన్‌గంగా నది ప్రవాహాన్ని స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి పరిశీలించారు. వర్షాకాలం వచ్చిదంటే చాలు రాకపోకలకు అంతరాయంతో పాటు పంటచేలు నీటమునుగుతున్నాయని పలువురు రైతులు మంత్రి ఎదుట తమ గోడును వినిపించారు. పెన్‌గంగా పరిహాక ప్రాంతంలో కరకట్టలు నిర్మించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రిని కోరారు.
వరద సహాయక చర్యల్లో మానవతప్పిదం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత పంటల నష్టంపై అంచనా వేసి రైతులకు అండగా నిలబడతామని అన్నారు. వరదలపై శాశ్వత పరిష్కారం కోసం సమస్యను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దగ్గరకు తీసుకెళ్తానని ప్రజలకు మాట ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిస్థితులకనుగుణంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు.