మేడిగడ్డ కుంగిన తర్వాత వచ్చి చూడడం వల్ల ఏం లాభం : శ్రీధర్ బాబు
🎬 Watch Now: Feature Video
Published : Mar 2, 2024, 6:22 PM IST
Minister Sridhar Babu Fires on BRS : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో నాణ్యతా నిర్మాణాల పనులు చూడకుండా.. ఇప్పుడు చూడటం వల్ల ఏం లాభం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంధనిలో గృహజ్యోతి కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కుంగిపోయిన మేడిగడ్డ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో నిపుణుల సూచనల కోసం ప్రభుత్వం వేచి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
రీ డిజైన్ చేయవద్దని అక్కడ ప్రాజెక్టు నిర్మాణం సహేతుకం కాదని నిపుణులు సలహా ఇచ్చిన పెడచెపిన పెట్టారని మంత్రి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కుంగిపోయిన మేడిగడ్డ, బుంగలు పడి అన్నారం బ్యారేజీ చూసిన తర్వాతనైనా కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఎంఐఎం పార్టీలు రాజకీయం చేయడం లేదని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణలు చెబితే చాలన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.