ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు : మంత్రి శ్రీధర్ బాబు - Minister Sridhar Babu on BRS - MINISTER SRIDHAR BABU ON BRS
🎬 Watch Now: Feature Video


Published : Jul 12, 2024, 5:11 PM IST
Minister Sridhar Babu on BRS : ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్టీలోకి వస్తాం అంటే ఎవరైన వద్దంటారా అని ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించేలా తాము ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ఒకరకంగా చేరికలు చేసుకుందని, భయపెట్టి అనేక రకాలుగా తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని తెలిపారు.
స్వచ్ఛందంగా మా పార్టీలోకి వస్తున్నారు : ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు స్వయంగా వారే కాంగ్రెస్లోకి వస్తున్నారని, ప్రజలకు సేవ చేస్తున్న తమ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నారని మంత్రి శ్రీధర్ అన్నారు. గులాబీ పార్టీలో మిగిలే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో వారే చెప్పాలని ఎద్దేవా చేశారు. అంతకముందు రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత, కూచిపూడి నృత్య గురువు ఆలేఖ్య పుంజాలను మంత్రి అభినందించారు.