గత బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు చేసింది ఏమీలేదు : మంత్రి సీతక్క - మంచిర్యాలలో సీతక్క సమావేశం
🎬 Watch Now: Feature Video
Published : Feb 1, 2024, 3:32 PM IST
Minister Seethakka Fires on BRS : పార్టీ పేరులోనే తెలంగాణ లేకుండా భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న గత ప్రభుత్వ నాయకులకు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి సీతక్క మండిపడ్డారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. 2021 ఆగస్టు 9న పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటి బహిరంగ సభను ఇక్కడే నిర్వహించి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
Seethakka Comments on BRS : వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆశయాలపై గత ప్రభుత్వం నీళ్లు చల్లిందని సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమీలేదని, వెనుకబడ్డ జిల్లాలకు కనీసం మంచి నీరు అందించే ప్రాజెక్టులు కూడా లేవని సీతక్క ఆక్షేపించారు.