కరీంనగర్ అగ్నిప్రమాద ఘటన - బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామన్న మంత్రి పొన్నం - Minister visits Karimnagar Victims
🎬 Watch Now: Feature Video
Published : Feb 21, 2024, 1:02 PM IST
Minister Ponnam visits Fire Accident Victims in Karimnagar : కరీంనగర్ ఆదర్శనగర్‌లో ఈ నెల 20న అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. దాదాపు 17 కుటుంబాలు మేడారం జాతరకు వెళ్లిన క్రమంలో గుడిసెల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో బాధితుల సామగ్రి అంతా బుగ్గిపాలైంది. బాధితులను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. Minister Ponnam about Fire Victims in Karimnagar : ఏ మేరకు నష్టం జరిగిందనే అంశాన్ని అధికారులు అంచనా వేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని, విలువైన పత్రాలు, సర్టిఫికెట్లు తిరిగి పొందేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాధితులు ఎవరూ కూడా ఆందోళనకు గురి కావొద్దని ధైర్యం చెప్పారు. వెంటనే తాత్కాలిక వసతులు, భోజనాలు కల్పించడంతో పాటు గృహ నిర్మాణంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు.