ప్రైవేటు ఆసుపత్రులు సామాజిక బాధ్యతతో సేవలు అందించడం అభినందనీయం : మంత్రి పొన్నం - Minister Ponnam Prabhakar in Nagole - MINISTER PONNAM PRABHAKAR IN NAGOLE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-03-2024/640-480-21110895-thumbnail-16x9-ponnam.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 31, 2024, 10:21 AM IST
Minister Ponnam Prabhakar opened Cardiology Dept in Hyderabad : తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వం వైద్యపరంగా మరిన్ని సదుపాయాలు తీసుకువస్తోందని మంత్ర పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నాగోల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కార్డియాలజీ విభాగాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ హస్పిటల్ ఛైర్మన్ విజయ్‌తో కలిసి ప్రారంభించారు. అలాగే మాతృ, శిశు పేరిట కొత్తగా ఏర్పాటు చేసిన స్కీమ్‌ను ఆయన మొదలు పెట్టారు.
తెల్ల రేషన్ కార్డు కలిగి ఆరోగ్య శ్రీ ఉన్న ప్రతి గర్బిణీకి రూ.20వేలకే డెలివరీ సేవలు అందించడం జరుగుతుందని హస్పిటల్ ఛైర్మన్ విజయ్ తెలిపారు. అదే విధంగా రూ.20లకే డాక్టర్ కన్సల్టేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రి అందిస్తున్న ఈ సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. ప్రభుత్వం కూడా రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలకోసం అన్ని రకాల చర్యలు చేపడుతోందని తెలిపారు. అయితే పెరుగుతున్న జనాభా, ఆరోగ్య సమస్యల దృష్ట్యా ప్రైవేటు ఆసుపత్రులు ఇలాంటి సేవలతో ముందుకు రావడం అభినందనీయమన్నారు.